Ad Code

ఉయ్యూరు సమీపంలో బోల్తా కొట్టిన కారు : నలుగురు మృతి


ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ – మచిలీపట్నం హైవేపై ఉయ్యూరు సమీపంలోని గండిగుంట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న టాటా సఫారీ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా ప్రాణాలు దక్కలేదు. ప్రమాద తీవ్రతకు కారు మొత్తం నుజ్జు నుజ్జు అయింది. హైవే పై నుంచి అదుపుతప్పి సర్వీసు రోడ్డులోకి బోల్తా కొట్టి 50 మీటర్లు పల్టీ కొట్టడంతో ఘటన స్థలం భీభత్సంగా మారింది. మృతులు విజయవాడకి చెందిన ప్రిన్స్ బాబు, చాట్రగడ్డ రాకేష్ బాబు , కుందేరుకి చెందిన చింతయ్యగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాపనయ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu