శ్రీలంకలో న్యూజిలాండ్‌కు మహిళా యాత్రికురాలికి ఎదురైన చేదు అనుభవం : సోషల్ వీడియోలో వైరల్


శ్రీలంకలో న్యూజిలాండ్‌కు చెందిన ఒక మహిళా యాత్రికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఓ స్థానిక వ్యక్తి ఆమెను వెంటాడి, వేధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ మహిళా ట్రావెలర్​ శ్రీలంక ప్రయాణం మొదలుపెట్టి నాలుగో రోజున ఈ బాధాకరమైన సంఘటన జరిగింది. ప్రయాణం సూర్యోదయం వేళ స్విమ్మింగ్‌తో ఉల్లాసంగా మొదలైనా, తర్వాత ఆమె మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది. "నా ముందు స్కూటర్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి పదేపదే నెమ్మదిస్తూ, నేను అతన్ని దాటి వెళ్లగానే మళ్లీ వేగంగా వచ్చి నన్ను దాటిపోయేవాడు," అని ఆమె వీడియోలో వివరించింది. మొదట్లో నవ్వుతూ ఉన్నప్పటికీ, అతని ప్రవర్తన అసౌకర్యంగా మారడంతో ఆమె అతన్ని పట్టించుకోవడం మానేసింది. ఒక మలుపులో అతను రోడ్డు మార్చడంతో, వదిలించుకున్నానని ఆమె భావించింది. అయితే, కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. "నేను కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, నీళ్లు తాగడానికి నా టుక్-టుక్‌ను ఆపగా, అతను మళ్లీ వచ్చాడు. తన స్కూటర్‌ దిగి నా దగ్గరకు వచ్చి మాట్లాడటానికి ప్రయత్నించాడు," అని ఆమె గుర్తు చేసుకుంది. భాషా సమస్య ఉన్నప్పటికీ, మొదట అతను స్నేహపూర్వకంగా కనిపించాడు. కానీ, ఆ సంభాషణ త్వరలోనే అసౌకర్యంగా మారింది. "అతను నేను ఎక్కడ ఉంటున్నానని అడిగాడు. అప్పుడే ఈ సంభాషణ ఎటు వెళుతోందో నాకు అర్థమైంది," అని ఆమె చెప్పింది. కెమెరాలో రికార్డ్ అయిన ఆ వీడియోలో, అతను ఆమెను లైంగిక సంబంధం అడగడమే కాక, తర్వాత అసభ్యంగా ప్రవర్తించడం, రోడ్డు మీదే హస్తప్రయోగం చేయడం స్పష్టంగా కనిపించింది. ఆ వ్యక్తి ప్రవర్తనతో తీవ్రంగా కలత చెందిన ఆ మహిళ వెంటనే ఆ ప్రదేశం నుంచి టుక్-టుక్‌ నడుపుకుంటూ వెళ్లిపోయింది. ఆ వీడియోలో ఆమె షాక్, కోపాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ సంఘటన వల్ల తన మిగిలిన ప్రయాణం అంతా "ఒక రకమైన భయం"తో గడిపే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. "అతను ఆ ప్రశ్న అడగడాన్ని నేను నమ్మలేకపోయాను, నేను 'లేదు' అని చెప్పినా, అతను అంత ధైర్యంగా నా ముందు తనను తాను అసభ్యంగా ప్రదర్శించుకోవడం చూసి కోపం వచ్చింది," అని ఆమె చెప్పింది. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు 23 ఏళ్ల వయస్సు గల ఆ స్థానిక వ్యక్తిని పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఎదుర్కొనే సవాళ్ల గురించి ఆలోచిస్తూ, ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకుంది: "ఈ ఒక్క సంఘటన నా ప్రయాణాన్ని నాశనం చేయాలని నేను కోరుకోవడం లేదు. కానీ ఇది నా ఆత్మవిశ్వాసాన్ని కాస్త దెబ్బతీసింది. ఒంటరి మహిళగా ప్రయాణానికి చెల్లించాల్సిన మూల్యం ఇదే! ఇది జరగకూడదు, కానీ దురదృష్టవశాత్తూ ఇది నిజం. ఆ వ్యక్తి నన్ను ఇలా ఫీల్ అయ్యేలా చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది," అని ఆమె పేర్కొంది. తన ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్‌లో, ఈ సంఘటనను కేవలం ఒక్కరి చర్యగా మాత్రమే చూడాలని, ఇది శ్రీలంక దేశాన్ని నిర్వచించదని ఆమె బలంగా చెప్పింది. "నేను కలిసిన స్థానిక ప్రజలు అత్యంత దయగల, ఉదార మనష్యులు. ఇది ఒక్క మనిషి, ఒక్క క్షణం చేసిన తప్పు - దీన్ని మొత్తం దేశానికి ఆపాదించకూడదు," అని స్పష్టం చేసింది. "ఒంటరిగా ప్రయాణించడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. కానీ అది ఎప్పుడూ నవ్వులు, సంతోషాలతో నిండి ఉండదు! కొన్ని రోజులు మీ ధైర్యాన్ని పరీక్షిస్తాయి. అందువల్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఈ సంఘటన గుర్తుచేస్తుంది," అని ఆమె ముగించింది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains