ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఈ-బైక్, ఈ-ఆటో సబ్సిడీ అందిస్తోంది. ఈ-బైక్ కొనుగోలు చేస్తే ₹ 12,000 సబ్సిడీ, ఈ-ఆటో కొనుగోలు చేస్తే ₹30,000 సబ్సిడీ అందిస్తోంది. పెట్టుబడి లేకుండా బ్యాంక్ రుణం పొందే అవకాశం కల్పిస్తారు. రాపిడో ద్వారా నెలకు ₹25,000 - ₹30,000 ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఉచిత డ్రైవింగ్ శిక్షణ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీనికి ప్రధాన అర్హత డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు అయి ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 21 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. దరఖాస్తు చేసేందుకు జిల్లా మెప్మా కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, డ్వాక్రా ఐడీ సమర్పించాలి. అలాగే దరఖాస్తు ఫారం నింపాలి. 15 రోజుల్లో లబ్దిదారుల్ని ఎంపిక చేస్తారు. ఎంపికైతే ఈ-బైక్ లేదా ఈ-ఆటో అందజేస్తారు. అయితే ఈ పథకం ప్రస్తుతం విజయవాడ , విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, కర్నూలులోనే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర పట్టణాలకు విస్తరిస్తారు.
0 Comments