Ad Code

తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కొండ చిలువ : వీడియో సోషల్ మీడియాలో వైరల్‌


తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో రాత్రి 9 గంటల సమయంలో  వినాయక స్వామి ఆలయాన్ని దాటిన తరువాత భక్తులకు కొండ చిలువ కనిపించింది. కారులో వెళ్లుతున్న భక్తులు కొండ చిలువను ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలను టీటీడీ ఈవో పరిశీలించారు. మంగళవారం రోజున టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గోశాలను పరిశీలించారు. గోశాల నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గోవులకు అందుతున్న దాణా, వసతి వివరాలతో పాటుగా వాటికి అందిస్తున్న వైద్యం, తాగునీరు, పరిశుభ్రత వంటి అంశాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్వీ గోశాల వద్ద 500 గోవులకు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ భవనాన్ని ఆధునిక వసతులతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ ఈవో ఈ భవనాన్ని పరిశీలించారు. గోవులు, దూడలు ఉంటున్న షెడ్లను పరిశీలించారు. గోశాలలోని పశువుల సంఖ్య, అగరుబత్తీల యూనిట్, దాణా మిక్సింగ్ ప్లాంట్ కార్యాకలాపాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు.

Post a Comment

0 Comments

Close Menu