Ad Code

శబరిమలలో ఏపీ భక్తులపై దురుసుగా ప్రవర్తించిన సెక్యూరిటీ సిబ్బంది : సోషల్ మీడియాలో వీడియో వైరల్


బరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చిన ఏపీ భక్తులపై అక్కడి భద్రతా సిబ్బంది అత్యంత అమానుషంగా, దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తుల పట్ల సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు ఆలయంలోని సౌకర్యాలు, దర్శనం వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా, భద్రత అధికారులు కోపంతో ఊగిపోయారు. ఆలయ సిబ్బంది కనీస మర్యాద లేకుండా భక్తులను బూతులు తిడుతూ అమానుషంగా ప్రవర్తించారు. దీనితో పాటు దర్శనానికి దారి గురించి అడిగిన ఏపీ భక్తులకు ఓ భద్రతా సిబ్బంది అత్యంత వికృతంగా ప్రవర్తించాడు. సిబ్బందిలో ఒకరు ఏకంగా తన జిప్ విప్పి చూపిస్తూ స్వాముల పట్ల అసభ్యంగా దూషించారు. భక్తులకు కనీస గౌరవం ఇవ్వకుండా, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా సెక్యూరిటీ అధికారి వ్యవహరించడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది దురుసు ప్రవర్తనతో పాటు, ఆలయంలో భక్తులకు కల్పించిన కనీస సౌకర్యాల లేమిపై కూడా అయ్యప్ప భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు వచ్చే శబరిమలలో దర్శనం కోసం కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దర్శనం కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని, దీనికి తగిన వసతులు కల్పించడంలో ఆలయ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మండిపడుతున్నారు. ఏపీ భక్తులపై భద్రతా సిబ్బంది దురుసు ప్రవర్తన, ఆలయంలోని వసతుల లేమిపై కేరళ ప్రభుత్వంతో పాటు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తక్షణమే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu