బెంగళూరులోని డైరీ సర్కిల్ వద్ద పట్టపగలు భద్రతా సిబ్బందిని మోసగించి ఏటీఎంలో నగదు తరలించే వాహనంలోని రూ.7.11 కోట్ల నగదుతో ఉడాయించారు. ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నగరంలోని డైరీ సర్కిల్ వద్దగల ఓ ఏటీఎం మెషీన్‌లో నగదు డిపాజిట్ చేసేందుకు గానూ వాహనంలో బ్యాంక్ సిబ్బంది క్యాష్‌తో బయల్దేరారు. ఇంతలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉన్న ఓ ఇన్నోవా వాహనంలో దుండగులు వచ్చి తాము ఆర్‌బీఐ అధికారులమని చెబుతూనే సిబ్బందిని మోసగించి వాహనంలోని నగదును దోచుకెళ్లారు. చోరీకి గురైన సమయంలో అందులో రూ.7.11 కోట్ల క్యాష్ ఉందని సదరు సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందంతో దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
0 Comments