Ad Code

రెండు ప్రైవేటు బస్సులు ఢీ : ఆరుగురు మృతి, 35 మందికి గాయాలు


మిళనాడులోని కడయనల్లూరు దగ్గర,  తెన్కాసి-మధురై రహదారిపై సోమవారం ఉదయం రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 35 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను తెన్కాసిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అత్యంత వేగంగా దూసుకురావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.




Post a Comment

0 Comments

Close Menu