ఐరాస కాప్‌30 వాతావరణ సదస్సు ప్రధాన వేదిక వద్ద భారీ అగ్నిప్రమాదం : 13 మందికి తీవ్ర గాయాలు


బ్రెజిల్‌లోని బెలెం నగరంలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి కాప్‌30 వాతావరణ సదస్సు ప్రధాన వేదిక వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కీలక సమావేశాలు జరిగే "బ్లూ జోన్"లో ఈ ప్రమాదం జరగడంతో వేలాది మందిని అక్కడ నుంచి తరలించారు. అగ్ని ప్రమాదం సందర్బంగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్రెజిల్‌లో ఐక్యరాజ్యసమితి కాప్‌30 వాతావరణ సదస్సు జరుగుతోంది. ఈ సమావేశంలో దాదాపు 200 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ వాతావరణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి సంధానకర్తలు ప్రయత్నిస్తున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్ పెవిలియన్ వద్ద మంటలు చెలరేగి భవనం గోడలు, పైకప్పును కప్పి ఉంచిన ఫాబ్రిక్ షెల్ పైకి వేగంగా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో 13 మంది గాయపడ్డారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం