దేశీయ మార్కెట్లో X300 సిరీస్‌ను డిసెంబర్ 2న విడుదల వివో చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనా, ఇతర గ్లోబల్ మార్కెట్లలో అక్టోబర్‌లో లాంచ్ అయిన ఈ సిరీస్ భారత్‌లో మాత్రం ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ రెడ్ కలర్ ఆప్షన్‌తో మరింత ఆకర్షణీయంగా రానుంది. ఈ సిరీస్‌లో వివో X300, వివో X300 ప్రో అనే రెండు ప్రీమియమ్ మోడళ్లను అందిస్తున్నారు. వివో ఈ సిరీస్‌తో పాటు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన టెలీఫోటో ఎక్సటెన్డేర్ కిట్ ను కూడా భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో Zeiss 2.35x టెలికన్వర్టర్ లెన్స్‌లు ఉంటాయి. ఇవి వివో ‘టెలికన్వర్టర్’ మోడ్‌తో కలిసి పనిచేస్తాయి. అలాగే ఆటోమేటిక్ లెన్స్ రికగ్నిషన్ కోసం NFC సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. పనితీరు పరంగా భారత మార్కెట్‌లోకి రానున్న వివో X300 మోడళ్లు 3nm ఆర్కిటెక్చర్‌తో రూపొందించిన శక్తివంతమైన మీడియా టెక్ డిమెన్షిటీ 9500 చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయి. ఇందులో ప్రో ఇమేజింగ్ VS1, V3+ ఇమేజింగ్ చిప్‌లు ఉండటం వల్ల కెమెరా పనితీరు మరింత మెరుగుపడుతుంది. రెండు మోడళ్లు తాజా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే ఆరిజిన్ ఓఎస్ 6 పై నడుస్తాయి, ఇది స్మూత్ UI, వేగవంతమైన ప్రదర్శన, మెరుగైన AI ఆప్టిమైజేషన్‌లను అందిస్తుంది. ఇందులో Zeiss ట్యూన్ చేసిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony LYT-828 ప్రైమరీ కెమెరా (f/1.57), 50MP Samsung JN1 అల్ట్రా-వైడ్ లెన్స్ (f/2.0), 200MP HPB APO టెలిఫోటో కెమెరా (f/2.67) ఉన్నాయి. వీటితో పాటు సెల్ఫీ కోసం ముందు భాగంలో 50MP Samsung JN1 కెమెరాను ఏర్పాటు చేశారు. స్టాండర్డ్ Vivo X300 మోడల్ కూడా కెమెరా పరంగా బాగానే ఉంటుంది. ఇందులో 200MP HPB ప్రైమరీ కెమెరా (f/1.68) OISతో, 50MP Sony LYT-602 టెలిఫోటో లెన్స్ (f/2.57) OISతో, 50MP Samsung JN1 అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. దీనిలో కూడా ముందు భాగంలో 50MP JN1 సెల్ఫీ కెమెరానే అమర్చారు.
0 Comments