దేశీయ మార్కెట్లోకి ఎంఎక్స్ 16 ప్రో అనే పేరుతొ కోమాకి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఓలా, ఏథర్ వంటి కొత్త బ్రాండ్లు రాకముందే సామాన్య ప్రజల కోసం ఈవీలను పరిచయం చేసిన కోమాకి, ఇప్పుడు క్రూయిజర్ స్టైల్లో తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు కోరుకునే వినియోగదారుల కోసం ఈ మోడల్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఎంఎక్స్ 16 ప్రో బైక్ చూసిన వెంటనే క్లాసిక్ క్రూయిజర్ లుక్‌ను గుర్తు చేస్తుంది. పొడవైన హ్యాండిల్‌బార్, వెడల్పైన సీటింగ్, పెద్ద బాడీ ప్యానెల్స్ దీనికి రోడ్డుపై ఆకర్షణీయమైన ప్రెజెన్స్‌ను ఇస్తాయి. ఈ మోడల్ రెండు ఆకట్టుకునే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా డ్యూయల్-టోన్ జెట్ బ్లాక్ ఈ బైక్‌కు స్పోర్టీ, ప్రభావవంతమైన లుక్‌ను జోడిస్తుంది. ఈ బైక్ ధరను రూ. 1,69,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది ఈవీ మార్కెట్లో మధ్యస్థ బడ్జెట్ సెగ్మెంట్‌కు గట్టి పోటీ ఇవ్వగల రేంజ్‌లో ఉంది. ప్రతి రోజూ ఎక్కువ ప్రయాణాలు చేసే ప్రయాణీకులకు, మెయింటెనెన్స్‌పై ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండాలని భావించే కస్టమర్లకు ఇది అనువైన బైక్ ఇది. ఈ బైక్‌కు ప్రధాన బలం దాని పవర్, ఎఫిషియెన్సీ. కోమాకి MX16 Pro బైక్‌లో అమర్చిన మోటార్ 5 kW BLDC హబ్ మోటార్, 4.5 kWh పెద్ద సామర్థ్యమైన బ్యాటరీ ఈ బైక్ కు అసలు బలంగా నిలుస్తాయి. హబ్ మోటార్ గరిష్టంగా 6.7 bhp పవర్‌ను అందిస్తుంది. ఈ బైక్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌పై 160 కి.మీ నుండి గరిష్టంగా 220 కి.మీ వరకు ప్రయాణించగలదు. 200 కి.మీ ప్రయాణించడానికి కేవలం రూ. 15-20 మాత్రమే ఖర్చు అవుతుంది. 200 కి.మీ దూరాన్ని పెట్రోల్ బైక్‌పై ప్రయాణిస్తే సుమారు రూ. 700 వరకు ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. కానీ Komaki MX16 Proతో అదే దూరాన్ని కేవలం రూ. 15-20 ఖర్చుతో ప్రయాణించవచ్చు. రోజువారీ ప్రయాణాలు చేసే విద్యార్థులు, ఉద్యోగస్తులు, డెలివరీ రైడర్లకు ఈ తక్కువ రన్నింగ్ ఖర్చు గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది. రైడర్‌కు అవసరమైన అన్ని ఆధునిక ఫీచర్లు ఈ బైక్‌లో అందుబాటులో ఉన్నాయి: ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, TFT డిస్‌ప్లే, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ అసిస్ట్, ఆటో-రిపేర్ స్విచ్, పార్క్ అసిస్ట్, అధునాతన బ్రేకింగ్ వ్యవస్థ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
0 Comments