చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 15 మన దేశంలో నవంబర్ 13న రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. అదే రోజు రాత్రి రాత్రి 8 గంటలకు ఈ హ్యాండ్‌సెట్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్, శక్తివంతమైన మొబైల్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 6.78 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ స్క్రీన్ 165Hz రిఫ్రెష్‌రేటుకు సపోర్ట్ చేస్తుంది. IP68 రేటింగ్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16తో ఇది పనిచేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను ఇందులో అమర్చారు. ఈ చిప్‌సెట్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ CPU అని చెప్పొచ్చు. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ సోనీ IMX906 OIS మెయిన్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్స్, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 32 ఎంపీ సోనీ IMX709 సెన్సర్ ఉంటుంది. వన్‌ప్లస్ 15 ఫోన్ 7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120W సూపర్ ఫ్లాష్ ఛార్జర్, 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్‌తో వస్తుంది. 8.31 ఎంఎం మందంతో వస్తున్న వన్‌ప్లస్ 15 ఫోన్ బరువు 215 గ్రాములు. 12GB, 16GB LPDDR5x అల్ట్రా RAM ఎంపికలతో వస్తుంది. 1TB వరకు UFS 4.1 నిల్వ ఉంటుంది.
0 Comments