Ad Code

ప్రజా భద్రత, చట్టం, శాంతి పరిరక్షణలో అప్రతిహతంగా పోలీసులు పని చేస్తున్నారు


పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన వీర పోలీసు సైనికులకు హృదయపూర్వక నివాళులు ఆర్పిస్తున్నాను అని ఆ పోస్టులో తెలిపారు. శాంతి, భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు సిబ్బందికి అభినందనలు, పోలీసుల త్యాగం, సేవ తర తరాలను ప్రేరేపిస్తోంది అన్నారు. ప్రజా భద్రత, చట్టం, శాంతి పరిరక్షణలో అప్రతిహతంగా పోలీసులు పని చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ రాసుకొచ్చారు. క్రైమ్ రేటు తగ్గించడంలో పోలీసుల చేపట్టే ప్రణాళిక, ప్రజా ముఖ్య దృష్టి కోణం ప్రశంసనీయం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. విధుల పట్ల అంకితభావంతో పని చేసే పోలీసుల త్యాగాన్ని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu