Ad Code

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్


మ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి సీపీఐ (ఎం-ఎల్) లిబరేషన్ తరఫున అయిదుసార్లు శాసన సభకు గుమ్మడి నర్సయ్య ఎన్నికయ్యారు. ఆయన జీవిత చరిత్ర తెరకెక్కబోతోంది. లీడ్ క్యారెక్టర్ లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 1985, 1989, 1994 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టారు. అనంతరం 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన గడిపిన అతి సాధారణ జీవితం పాన్-ఇండియాగా తెరకెక్కబోతోంది. ఈ చిత్రం పేరు 'గుమ్మడి నర్సయ్య'. ఆయన పడిన కష్టాలు, గడిపిన అతి సాధారణ జీవితమే ఈ సినిమా మూలకథ. చిత్రీకరణ అంతా దీని చుట్టే తిరుగుతుంది. ఈ మూవీతో కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్నాడు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్ సురేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ సైతం విడుదలైంది. శివ రాజ్‌కుమార్ ఆఫ్ వైట్ కుర్తా పైజామా ధరించి, భుజంపై ఎరుపు శాలువతో దర్శనమిచ్చారు. సీపీఐ (ఎంఎల్) జెండా కట్టిన సైకిల్‌ను పట్టుకుని కనిపించారిందులో. కరునాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గుమ్మడి నర్సయ్య' ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరిస్తున్నామని, ఓఅసాధారణమైన, స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి ఇది ఓ శక్తిమంతమైన తొలి అడుగు అని చిత్రం యూనిట్ పేర్కొంది. దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియోలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాల దృశ్యాలు, భారత రాజ్యాంగం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాధాన్యత ఇచ్చారు. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్‌కుమార్ ను పరిచయం చేశారు. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Post a Comment

0 Comments

Close Menu