ఎలక్ట్రిక్ కుక్కర్‌ను ఉపయోగించడం వల్ల సాంప్రదాయిక పద్ధతిలో వంటకు ఖర్చయ్యే సమయం, శ్రమ రెండూ తగ్గుతాయి. అయితే, ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన ఆహారం ఆరోగ్యానికి మంచిదేనా ? ఈ సందేహం అనేక మందిలో ఉంది. దీని పైన నిపుణులు అనుకూలతలతో పాటుగా ప్రతికూలతలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ కుక్కర్ లో అన్నం వండటం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో ఆరోగ్య పరంగా నష్టాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో ఎక్కువ సేపు అన్నం ఉడికించడం వల్ల కొన్ని ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు కొంత మేర నష్టపోవచ్చు. వంటల్లో అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పాత్ర టాక్సిన్ మెటల్‌తో తయారవుతుంది. ఇందులో అన్నం ఉడికించడం వల్ల అందులోని పోషకాలు కనుమరుగవుతాయి. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అస్సలు వాడొద్దని వైద్య నిపుణులు చెడుతున్నారు. కాగా, నాన్ స్టిక్ వస్తువులను వినియోగించి వంట చేసే సమయంలో అందులోంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్‌కు కారకాలుగా మారే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను వాడకపోవడం మంచిది. రాగి సంకటి, రాగి జావ, జొన్న రొట్టెలు, కొర్రలతో అల్పాహారం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం త్వరగా వండాలనుకున్నప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో వండితే ఆరోగ్యానికి మేలు. కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహారం తీసుకోకపోవడమే మంచిది. మట్టిపాత్రలు, లేదా స్టీల్ పాత్రల్లో అన్నం ఉడికించి తీసుకోవడం మేలు. మట్టిపాత్రల్లో అన్నం ఉడికించడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచిని ఇస్తాయి. ప్రెజర్ కుక్కర్‌లో అన్నం ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరి రూపంలో కరిగిపోకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
0 Comments