న్యూయార్క్ లోని మాన్ హట్టన్ చెల్సియా క్యాంపస్ లోని గూగుల్ ఆఫీస్ లో నిశితంగా పరిశీలించిన ఒక స్నిపర్ డాగ్ ఆఫీసులో నల్లులు ఉన్నట్టు గుర్తించింది. ఈ క్రమంలో గూగుల్ కు చెందిన పర్యావరణ, ఆరోగ్య, భద్రతాధికారులు ఈనెల 19వ తేదీన తమ పంపించారు. దాని ప్రకారం ఆఫీసులో నల్లుల బెడద ఎక్కువగా ఉందని, సమస్య పరిష్కారం అయ్యేవరకు ఎవరూ ఆఫీస్ కు రావద్దని తమ ఉద్యోగులకు తెలియజేశారు. ఎవరికైనా దురద వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని సూచించారు. గూగుల్ లో పనిచేసే సిబ్బంది ఇళ్లల్లోనూ నల్లులు కనిపిస్తే వాటి నివారణకు సంబంధించిన ప్రొఫెషనల్ సంప్రదించాలని గూగుల్ తన ఉద్యోగులకు సూచించింది. న్యూయార్క్ లోని గూగుల్ కార్యాలయంలో పెద్ద మొత్తంలో జంతువుల బొమ్మలు ఉంటాయి. ఈ జంతువుల బొమ్మలు ఉంచటం వలన నల్లుల బెడద పెరిగి ఉంటుందని కార్యాలయ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇక ఉద్యోగులు నల్లుల బారినపడి ఏవైనా స్కిన్ ఎలర్జీలు, దురద వంటివి కనిపిస్తే దానికి సంబంధించిన నివేదికలు అందజేయాలని గూగుల్ పేర్కొంది. న్యూయార్క్ లోని గూగుల్ ఆఫీసులో నల్లుల బెడద ఘటన చోటు చేసుకోవడం ఇది రెండవసారి. 2010 సంవత్సరంలో కూడా ఇటువంటి ఘటనే గూగుల్ లో జరిగింది.
0 Comments