మందార పూలు మహిళలకు సౌందర్య సాధనలో ఎంతో తోడ్పడుతుంది. మందార పూల పొడిని తయారు చేసి ఫేస్ ప్యాక్ లేదా మాస్క్‌గా ఉపయోగించాలి. రెండు టేబుల్ స్పూన్ల మందార పొడి, టేబుల్ స్పూన్ పెరుగు, టీస్పూన్ తేనె కలిపి మొత్తటి పేస్ట్ తయారు చేసుకొని ముఖానికి పట్టించి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మిలమిలలాడే సౌందర్యం మీ సొంతమవుతుంది. ఎందుకంటే మందారలో ఉండే సహజమైన మ్యూసిలేజ్ సమ్మేళనాలు తేమను నిలుపుకోవడంలో తోడ్పడతాయి. అంతేకాదు, మందారలోని నేచురల్ ఆస్ట్రింజెంట్లు తైల స్రావాన్ని నియంత్రించడంలో, మొటిమలను తగ్గించడంలో సహాయపడటమేగాక ఇవి అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. సహజంగా వచ్చే చర్మం ముడతలు, గీతలను తగ్గించడంలో సహాయపడతాయి.
0 Comments