Ad Code

ఈ ఏడాది అత్యధిక జీతం అందుకున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల


మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 2025 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 96.5 మిలియన్ డాలర్లు సంపాదించారు. కంపెనీ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం కృత్రిమ మేధస్సు రంగంలో మైక్రోసాఫ్ట్ సాధించిన పురోగతిని చెప్పుకోవచ్చు. 58 ఏళ్ల సత్య నాదెళ్ల FY25లో జీతంలో 22 శాతం పెరుగుదల నమోదు చేశారు. గత ఏడాది అతను 79.1 మిలియన్ డాలర్లను సంపాదించారు.  ప్రాక్సీ ఫైలింగ్ ప్రకారం సత్య నాదెళ్ల, అతని నాయకత్వ బృందం మైక్రోసాఫ్ట్‌ను కృత్రిమ మేధస్సు రంగంలో స్పష్టమైన నాయకునిగా నిలబెట్టిన ఫలితంగా ఈ జీతం ఉందని బోర్డు పేర్కొంది. సత్య నాదెళ్ల పదవీకాలంలో జూన్ 30, 2025 నాటికి మైక్రోసాఫ్ట్ షేర్ల మొత్తం విలువ 1500 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 3.4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. జీతంలో దాదాపు 90 శాతం స్టాక్‌లో ఉండగా, బేసిక్ జీతం 2.5 మిలియన్ డాలర్లు మాత్రమే. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్లలో 23 శాతం పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అమెజాన్ వంటి పోటీదార్ల కంటే ఎక్కువ స్థిరమైన వృద్ధి రేటును సాధించింది. సీఈఓ పనితీరు ఆధారిత జీతం పరంగా 95 శాతం పైగా వార్షిక లక్ష్య పరిహారం పనితీరు ఆధారంగా ఉంది. నగదు ప్రోత్సాహకం 70 శాతం ముందే నిర్ణయించిన ఆర్థిక లక్ష్యాలను చేరడం ఆధారంగా ఇవ్వబడుతుంది. ఇక సీఎఫ్ఓ అమీ హుడ్ 29.5 మిలియన్ డాలర్ల జీతం పొందగా, మైక్రోసాఫ్ట్ వాణిజ్య విభాగానికి పదోన్నతి పొందిన జడ్సన్ ఆల్థాఫ్ 28.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. FY24లో నాదెళ్ల జీతం 63 శాతం పెరిగి 79.1 మిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం జీతంలో 71.2 మిలియన్ డాలర్లు స్టాక్ అవార్డులు కాగా , 5.2 మిలియన్ డాలర్లు 'నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్'గా ఉన్నాయి. 169,791 డాలర్లు ఇతర పరిహారాలుగా ఉన్నాయి. నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరి.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, క్లౌడ్ & ఎంటర్‌ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సర్వర్ & టూల్స్ ప్రెసిడెంట్, ఆన్‌లైన్ సర్వీసెస్ డివిజన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంటి అనేక పదవులను నిర్వర్తించారు. 3 దశాబ్దాల పైగా అతను కంపెనీతో పని చేస్తున్నారు. అయినా 96.5 మిలియన్ డాలర్ల జీతం తో నాదెళ్ల అమెరికాలో అత్యధిక జీతం పొందుతున్న CEO కాదు. కోహెరెంట్ CEO జిమ్ ఆండర్సన్ 2024లో 101.4 మిలియన్ డాలర్లు సంపాదించి 9 అంకెల జీతంతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆండర్సన్ జీతంలో 90 శాతం పైగా దీర్ఘకాలిక ఈక్విటీ అవార్డుల రూపంలో వచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu