Ad Code

రాజస్తాన్‌లో బంగారు గనిని గుర్తించిన భూగర్బ శాస్త్రవేత్తలు


రాజస్తాన్‌లోని బాన్స్‌వాడ జిల్లాలోని ఘటోల్ – కంకారియా గ్రామంలో మూడవ బంగారు గనిని భూగర్బ శాస్త్రవేత్తలు గుర్తించారు.  ఈ గనిలో మూడవ చ.కి.మీ విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మైనింగ్ లైసెన్స్ జారీ అయిన వెంటనే ఖనిజం వెలికితీత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నారు. భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనాల ప్రకారం, 940.26 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మొత్తం ప్రాంతంలో 113.52 మిలియన్ టన్నులు బంగారు ఖనిజం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఖనిజంను ప్రాసెస్ చేస్తే మొత్తం 222.39 టన్నుల బంగారు లోహం లభించవచ్చని.. కంకారియా-గారా ప్రాంతంలో 205 హెక్టార్లలో 1.24 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఈ గనిలో బంగారంతో పాటు, అనేక ఇతర ఖనిజాలు కూడా వెలికితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా కనుగొనబడిన ఈ గనితో దేశంలో బంగారం ఉత్పత్తిలో రాజస్తాన్‌ వాటా మరో 25 శాతంకు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu