Ad Code

ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తే క్షమించేది లేదు : ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు హెచ్చరిక


ర్టీసీ బస్సులు ఎక్కే ప్రయాణికులు ఎవరైనా ఆర్టీసీ బస్సులు డ్రైవర్ల పైన, కండక్టర్ల పైన దాడులు చేస్తే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు హెచ్చరికలు జారీ చేశారు. బస్సులలో రద్దీ పెరిగిన క్రమంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో, ఆర్టీసీ కండక్టర్ లతో ప్రయాణికులు గొడవలు పడి పలుచోట్ల దాడులకు యత్నిస్తున్న క్రమంలో ఈ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆర్టీసీ డ్రైవర్ల పైన దాడులు చేస్తే క్షమించేది లేదని, కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ఆయన తెలిపారు. ఆర్టీసీ లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది వేతనాల క్రమబద్దీకరణకు అధ్యయన కమిటీ వేసి న్యాయం చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి ఐదు రకాల బస్సులలో జీరో టికెట్ మీద ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో బస్సులలో మహిళల ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. స్త్రీ శక్తి పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం పైన ఏపీ మహిళలు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ఫ్రీగా ప్రయాణం చేస్తూ తమ పనులను చేసుకుంటున్నారు. మహిళల బస్సు ప్రయాణాలు పెరగడంతో రద్దీకి తగ్గట్టుగా బస్సులను ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకు వస్తున్న ఏపీ సర్కార్ బస్సు ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తోంది. బస్సు ప్రయాణాలలో పురుషులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో, బస్సుల సంఖ్యను పెంచి వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని భావిస్తోంది. ప్రయాణికులకు ఆర్టీసీ బస్టాండ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలను, బస్టాండ్ లను సందర్శిస్తూ కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు అందిస్తున్న సేవలు, ఉద్యోగుల పనితీరు, ప్రయాణికుల సౌకర్యాల పైన ఆరా తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. 2028 నాటికి అన్ని డిపోలకు ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం అమలు తీరును పరిశీలించడానికి తను డిపోలలో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు.


Post a Comment

0 Comments

Close Menu