Ad Code

అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కేసీఆర్‌ను తిట్టడం తప్పా ఇంకేమీ చేయలేదు !


హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కేసీఆర్‌ను తిట్టడం తప్పా ఇంకేమీ చేయలేదని ధ్వజమెత్తారు. ఒకవేళ జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ‘మేము మోసం చేసినా మాకు ఓటు వేశారు’ అని వాళ్ళే అంటారని అన్నారు.  వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందో ముఖ్యమంత్రి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీలోని మంత్రులు గత వారం కొట్టుకున్నారని, ఉపఎన్నికల్లో మీరు గుద్దే గుద్దుడికి కాంగ్రెస్ వాళ్లు తుక్కు తుక్కు కావాలి అని కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అది, ఇది చేస్తామని చెప్పి ఒక్క పైసా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు, 800 రోజుల్లో ఉన్న బాకీ కార్డుని వారిని అడగాలని ప్రజలకు సూచించారు.  కాంగ్రెస్ వాళ్ళు ప్రమాణం చేయమంటారు. కళ్ళు మూసుకొని అని, బీఆర్‌ఎస్‌కి ఓటు వేయండి అంటూ ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments

Close Menu