2025 గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ సందర్భంగా బుధవారం శామ్‌సంగ్ కంపెనీ ‘గెలాక్సీ ఎక్స్ఆర్’ హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. ఇది మొట్టమొదటి ఎక్స్‌టెండెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌గా లాంచ్ చేసింది. గూగుల్, క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో యాపిల్ విజన్ ప్రోకి పోటీగా దీన్ని శామ్‌సంగ్ తీసుకొచ్చింది. ప్రస్తుతానికి శాంసంగ్ ఎక్స్‌ఆర్ దక్షిణ కొరియా సహా అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇతర దేశాల్లోనూ విడుదల కానుందని తెలుస్తోంది. గెలాక్సీ ఎక్స్ఆర్ 4కే మైక్రో OLED డిస్‌ప్లేతో వచ్చింది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ XR2+ Gen2 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ ఎక్స్‌ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే మొదటి డివైజ్ ఇదే. 90Hz రిఫ్రెష్ రేటు, 109 డిగ్రీల హారిజాంటల్, 100 డిగ్రీల వర్టికల్ వ్యూయింగ్ యాంగిల్‌తో ఇది లాంచ్ అయింది. అగ్మెంటెడ్ రియాలిటీ (AR) టెక్నాలజీని నిజజీవిత దృశ్యాలతో కలిపి చూపే సాంకేతికత ఇందులో ఉంది. ఇందులోని సెన్సర్ల సాయంతో హ్యాండ్ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా యూజర్లు చేతి సంకేతాలతో విడ్జెట్లు, యాప్స్‌ను సులువుగా నియంత్రించవచ్చు. ఈ హెడ్‌సెట్‌లో గూగుల్ జెమినీ ఏఐ అసిస్టెంట్ ఉంది. 3డీ ఫొటో, వీడియో క్యాప్చర్ కోసం మల్టీ కెమెరా సిస్టమ్‌ను ఇచ్చారు. సేఫ్టీ కోసం ఐరిస్ రికగ్నిషన్ ఉంది. వైఫై 7, బ్లూటూత్ 5.4 సపోర్ట్‌కి చేస్తుంది. ఈ హెడ్‌సెట్ సిల్వర్ షాడో రంగులో మాత్రమే అందుబాదులో ఉంది.
0 Comments