Ad Code

శివశంకర్ పెళ్లి చూపుల ముందు రోజు చిన్నటేకూరు ఎందుకు వెళ్లాడు ?


హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. కాలిబూడిద అయిన ఈ ఘోర ప్రమాదానికి కారణం ఓ బైక్. కర్నూలు సిటీకి చెందిన ఈ శివశంకర్ అర్థరాత్రి సమయంలో తన పల్సర్ బైక్ పై చిన్నటేకూరు ఎందుకు వచ్చాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాడు అనేది కుటుంబ సభ్యులు కూడా చెప్పలేకపోతున్నారు. శుక్రవారం పెళ్లి చూపులకు వెళ్లాల్సిన శివ శంకర్ ముందు రోజు అర్థరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో తాను ఉండే  ప్రజానగర్ ఏరియాలోని ఇంట్లో ఉండకుండా 20 కిలోమీటర్ల దూరంలోని చిన్నటేకూరు ఎందుకు వెళ్లాడు అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. హైవేపై రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదానికి కారకుడయ్యాడు. ఒక్కడి మిస్టేక్ వలన 19 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. రాంగ్ రూట్ లో పల్సర్ బైక్ పై వచ్చి బస్సును ఢీకొట్టడంతో ఎగిరి దూరంగా పడ్డాడు. కానీ బైక్ బస్సు కిందికి వెళ్లి ఇరుక్కుంది. దీంతో 300 మీటర్లు బైక్‌ను బస్సు లాక్కెళ్లింది. రోడ్డుపై బైకును ఈడ్చుకెళ్లడంతో స్పార్క్ పుట్టి మంటలు అంటుకున్నాయి. దీనికి తోడు డీజిల్ ట్యాంక్ లీకవ్వడంతో వెంటనే మంటలు భారీ ఎత్తున బైకుతో పాటు బస్సుకు అంటుకున్నాయి. ఏసీ బస్సు కావడంతో పూర్తిగా అద్దాలు మూసి వేసి ఉండటంతో బస్సంతా పొగ, మంటలు కమ్ముకుని ఊపిరాడక మంటల్లో కాలి ప్రయాణికులు చనిపోయారు.


Post a Comment

0 Comments

Close Menu