Ad Code

త్వరలో సన్యాసం తీసుంకుంటా : రేణు దేశాయ్


రేణు దేశాయ్‌ చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్‌ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నానంటూ తన కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. అయితే ఎవరి సినిమాలో నటిస్తుందో మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ త్వరలో తాను సన్యాసం తీసుంకుంటానని చెప్పి అభిమానులకు షాకిచ్చింది. ఒక సంవత్సరం మాత్రమే ఉంటానని, ఆ తర్వాత సన్యాసం తీసుకోని ఆశ్రమానికి వెళ్లిపోతానని రేణు దేశాయ్ వెల్లడించింది. అయితే ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కారణం మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Post a Comment

0 Comments

Close Menu