Ad Code

రాజమండ్రిలో విద్యార్థినిపై యువకుడు అత్యాచారం !


రాజమండ్రిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని సోమవారం సాయంత్రం అన్నయ్య వచ్చాడని, సబ్బులు తెచ్చుకోవాలని హాస్టల్ వార్డెన్‌కు చెప్పి బయటకు వెళ్ళింది. పరిచయం ఉన్న అజయ్ అనే యువకుడు మాయమాటలు చెప్పి గోదావరి గట్టుకు బైక్‌పై తీసుకువెళ్లాడు. అజయ్ వెంట బైక్‌పై మరో యువకుడు వచ్చాడు. ఆ బాలిక పట్ల అసభ్య ప్రవర్తిస్తూ మాయమాటలతో అజయ్ రైల్వే స్టేషన్ రోడ్ లో ఓ లాడ్జికు తీసుకువెళ్లాడు. రూమ్‌లో బాలికపై అజయ్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని బైక్‌పై తీసుకువచ్చి దేవీచౌక్‌లో దింపివేశాడు. ఆ తరువాత విద్యార్థిని హాస్టల్ లోనికి వెళ్లిపోయింది. అమ్మాయి కంగారు పడటం సహా మెడ, పెదాల పైన గాట్లు ఉండేసరికి అనుమానం వచ్చి వార్డెన్ ప్రశ్నించింది. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక జరిగిన విషయం చెప్పడంతో కంగారుపడి వెంటనే వారి తల్లిదండ్రులకు హాస్టల్ వార్డెన్ సమాచారం ఇచ్చింది. ముందుగా బాలికని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆ తర్వాత వార్డెన్ తో సహా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి బంధువులు పిర్యాదు చేశారు. అనుమానిత వ్యక్తి సెల్ నెంబర్ ఆధారంగా రావులపాలెంకు చెందిన అజయ్ గా పోలీసులు భావిస్తున్నారు. రాజమండ్రి పోలీసులు నిందితుడిపై ఫోక్సో, అత్యాచారం సెక్షన్లు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజమండ్రి టూ టౌన్ సీఐ శివ గణేష్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu