గూగుల్ అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ విల్లోను రూపొందించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దీన్ని విప్లవాత్మక పురోగతిగా భావిస్తోన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌లోని అత్యుత్తమ సంప్రదాయక అల్గారిథమ్ కంటే 13,000 రెట్లు వేగంగా ఈ విల్లో చిప్ క్వాంటమ్ ఎకోస్ పని చేస్తుంది. ఈ విషయాన్ని గూగుల్, ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. నేచర్ జర్నల్ ప్రచురితమైన కథనాన్ని దీనికి జత చేశారు. ఈ కొత్త అల్గారిథమ్ పరమాణువుల మధ్య పరస్పర చర్యలను న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఉపయోగించి ఎలా పని చేస్తుందో వివరించారు. ఇది భవిష్యత్తులో మెడిసిన్, మెటీరియల్స్ సైన్స్‌లో సరికొత్త బాటలు వేస్తుందని అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, టెక్ రంగాల్లో విల్లో చిప్ మొట్ట మొదటి రికగ్నైజ్డ్ క్వాంటమ్ అడ్వాంటేజ్‌ను సాధించిందని సుందర్ పిచాయ్ వివరించారు. దీన్ని 'క్వాంటమ్ ఎకోస్' అని పేరు పెట్టామని తెలిపారు. ఇది.. ప్రపంచంలోని వేగవంతమైన సూపర్ కంప్యూటర్ అల్గారిథమ్ కంటే 13,000 రెట్లు వేగంగా విల్లో చిప్ పని చేసిందని తెలిపారు. ఇతర క్వాంటమ్ కంప్యూటర్ల ద్వారా దీన్ని రీడెవలప్ చేయవచ్చని, మరిన్ని ప్రయోగాలు సాగించవచ్చని, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ కు మరింత చేరువ చేస్తుందని పిచాయ్ అన్నారు. ఓ అణువు నిర్మాణాన్ని సైతం ఈ విల్లో చిప్, క్వాంటమ్ ఎకోస్ అల్గారిథమ్ లెక్కించగలవని తెలిపారు. క్వాంటమ్ ఎకోస్ అనేది అవుట్-ఆఫ్-ఆర్డర్ టైమ్ కోరిలేటర్ అల్గారిథమ్ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఉపయోగించే టూల్ కంటే కూడా ఎన్నో రెట్లు వేగంగా పని చేస్తుందని అన్నారు. అణువులు, అయస్కాంతాల నుండి బ్లాక్ హోల్స్ వరకు ప్రకృతిలోని వ్యవస్థల నిర్మాణాన్ని తెలుసుకోవడానికి క్వాంటమ్ ఎకోస్ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేశారు.
0 Comments