Ad Code

అమరావతిలో బ్యాంకుల ప్రధాన కేంద్రాల ఏర్పాటు !


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొన్ని బ్యాంకులు ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని జాతీయ బ్యాంకులు మాత్రం వెనుకడుగు వేశాయి. ఎందుకంటే జాతీయ బ్యాంకులకు ఆర్బీఐ సహా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావాల్సిన అవసరం ఉంది . ఈ వ్యవహారంపై ఇటీవల విశాఖకు వచ్చిన నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు చర్చించారు. ఆ వెంటనే ఆమె బ్యాంకర్ల సమావేశం నిర్వహించి అనుమతులు ఇప్పించారు. ఆర్బీఐతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర బ్యాంకులు అమరావతిలో రాష్ట్ర స్థాయి ఆఫీసులను నిర్మించుకునేందుకు ముందుకు వచ్చాయి. ఇబ్బందులు తొలిగి పోవడంతో ఆయా బ్యాంకులు ముహూర్తాలు కూడా పెట్టుకున్నాయి. అనంతరం.. నిర్మాణాలను సొంతగా చేపట్టి సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అమరావతికి రానున్నారు. ఎస్బీఐ సహా పలు జాతీయ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు ఆ రోజు ఆమె భూమి పూజ చేసి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు. నిర్మలాసీతారామన్‌ చేతుల మీదుగా ప్రధాన బ్యాంకు కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఏర్పాట్లను ఘనంగా చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొననున్నారు.


Post a Comment

0 Comments

Close Menu