Ad Code

ఆలయంలో పార్కింగ్‌ విషయంపై గొడవ : మహిళ చెంపపై కొట్టిన పోలీస్‌ అధికారి


త్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో శుక్రవారం రాత్రి ఒక మహిళ స్థానిక ఆలయానికి వెళ్లింది. అక్కడ పార్కింగ్‌ విషయంపై గొడవ జరిగింది. పోలీస్‌ అధికారి శివమ్ ఆ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఆమె మొబైల్‌ ఫోన్‌ లాక్కుని నేలకు విసిరికొట్టాడు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఆ మహిళ చెంపపై కొట్టాడు. ఆమె తన కాలర్‌ పట్టుకున్నదని, యూనిఫామ్‌ చించిందని ఆరోపించాడు. మరోవైపు కొందరు వ్యక్తులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ప్రతాప్‌గఢ్‌ పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu