Ad Code

ముస్కానిపేటలో ప్రతి ఇంట్లో ఉన్నత విద్యావంతుడు !


తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే అమెరికాకు వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిగా ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి గుర్తుకొస్తారు. 1954లో గ్రామపంచాయతీగా ఏర్పడ్డ ముస్కానిపేటలో 3,625 మంది జనాభా నివసిస్తున్నారు. మండల కేంద్రం ఇల్లంతకుంటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామం నుంచి అమెరికాకు వెళ్లిన వారు 11 మంది, లండన్‌లో ఇద్దరు, ఆస్ట్రేలియాలో ఒకరు, ఇండియాలో 21 మందితో కలిపి 34 మంది సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. కె.లక్ష్మారెడ్డి అనస్తీషియా డాక్టర్‌గా యశోద ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. బద్దం అనిల్, సారా నరేశ్‌గౌడ్, సింగిరెడ్డి రమణారెడ్డి వివిధ బ్యాంకుల్లో మేనేజర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ఇటీవల ఏడుగురు ఉద్యోగ విరమణ పొందారు. ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి వరంగల్‌లోని రీజినల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ (ఆర్‌ఈసీ)లో ఇంజినీరింగ్‌ చదివారు. నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని చాలా మంది యువకులు అమెరికాకు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు.

Post a Comment

0 Comments

Close Menu