Ad Code

అమెజాన్ లో 2027 నాటికి 6,00,000 డెలివరీ, వేర్ హౌస్ ఉద్యోగాలు హ్యూమనాయిడ్ రోబోలతో భర్తీ


మెజాన్ రోబొటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ద్వారా 2025-2027 మధ్య కాలంలో 12.6 బిలియన్ల డాలర్ల మేర మానవ వనరులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన ఓ ఇంటర్నల్ డాక్యుమెంట్ ను ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. వచ్చే రెండేళ్లలో 1,60,000 వేర్‌ హౌస్ ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చని సమాచారం. అమెరికాలో గల అన్ని కార్యాలయాల్లో ఆటోమేషన్‌పై పెట్టుబడులు కొనసాగుతున్నాయని అమెజాన్ ఇప్పటికే ధృవీకరించడం. రోబోటిక్స్, ఆటోమేషన్ తో వేర్‌హౌస్, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో 75 శాతం ఆటోమేట్ చేయడానికి దీర్ఘకాలిక ప్రణాళికలను అమెజాన్ రూపొందించుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. 2027 నాటికి 6,00,000 డెలివరీ, వేర్ హౌస్ ఉద్యోగాలను హ్యూమనాయిడ్ రోబోలతో భర్తీ చేయడం లేదా మానవ వనరుల అవసరాన్ని తగ్గించడానికి సంస్థ యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తోంది. ఇది- అమెరికా కార్పొరేట్ చరిత్రలో ఓ అతిపెద్ద మార్పుగా భావిస్తున్నారు. ఈ అంచనాలు నిజమైతే.. రాబోయే కొన్ని సంవత్సరాల్లో మిలియన్ కంటే ఎక్కువ ఉద్యోగులను కలిగి ఉన్న అమెరికన్ కంపెనీల్లో ఆటోమేషన్, హ్యూమనాయిడ్ రోబోల వినియోగం భారీగా పెరగొచ్చు. ఒకప్పుడు ఉద్యోగులతో రద్దీగా ఉండే అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు రోబోలతో నిండిపోయే అవకాశం ఉంది. ఈ రోబోలు రౌండ్ ద క్లాక్ పనిచేస్తాయి. ఇ-కామర్స్‌ రంగంలో ప్రపంచస్థాయిలో పోటీ తీవ్రమౌతున్నందున ఖర్చులను తగ్గించడానికి, డెలివరీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి అమెజాన్ ఈ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. మనుషుల స్థానంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యంత్రాలను ప్రవేశపెట్టడం ద్వారా, కంపెనీ ఆర్డర్లను వేగంగా ప్రాసెస్ చేయాలని, అడ్మిన్ లోపాలను తగ్గించాలని, ఉత్పత్తులను మరింత ఖచ్చితత్వంతో డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రధానంగా ప్రోటియస్, సీక్వోయా వంటి అధునాతన రోబోటిక్స్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకుని రావాలని అమెజాన్ నిర్ణయించుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఆయా హ్యూమనాయిడ్ రోబోలన్నీ కూడా వేర్‌హౌస్‌లలో తమకు తాముగా కార్యకలాపాలను సాగించగలవు. సెన్సార్లు, కెమెరాలు, ఏఐ అల్గోరిథమ్‌లతో వాటిని తయారు చేస్తారు. మనుషుల పర్యవేక్షణ లేకుండా ప్యాకేజీలను తరలించడానికి, వాటిని లోడ్ చేయడం, కేటగిరీలుగా విభజించడం.. వంటి పనులన్నింటినీ చేస్తాయి. డెలివరీ వెహికల్స్, డ్రోన్ షిప్పింగ్ కార్యక్రమాలతో సహా ఏఐ -ఆధారిత లాజిస్టిక్స్, డెలివరీ కార్యకలాపాలను కూడా అమెజాన్ ఈ రోబోలతోనే భర్తీ చేయనుంది. 

Post a Comment

0 Comments

Close Menu