విజయవాడ నుంచి సింగపూర్ కు డైరెక్ట్ ఫ్లైట్ ను ఇండిగో సంస్థ ప్రారంభించనుంది. నవంబర్ 15వ తేదీ నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఛార్జీలు, టైమింగ్స్ ను ప్రకటించారు. ఈ సర్వీసుకు టికెట్ ధరను రూ.8,000గా ఇండిగో సంస్థ నిర్ణయించింది. సింగపూర్ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 7.45 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అనంతరం విజయవాడ నుంచి ఉదయం 10.05 గంటలకు తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 2.05కు సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయానికి చేరుకుంటుంది. ప్రయాణ సమయం సుమారు నాలుగు గంటలు ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే ఈ సర్వీసుకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో నడుస్తాయి. 180 నుండి 230 సీట్ల సామర్థ్యం గల బోయింగ్ విమానాలను ఇండిగో సంస్థ ఈ మార్గంలో వినియోగించనుంది. ప్రారంభ దశలో వారానికి మూడు రోజుల పాటు మాత్రమే సర్వీసులు నడపాలని నిర్ణయించారు. ప్రయాణికుల డిమాండ్ పెరిగితే రోజువారీ సర్వీసులుగా విస్తరించే ఆలోచనలో సంస్థ ఉంది. గతంలో 2018 డిసెంబరు నుండి 2019 జూన్ వరకు విజయవాడ-సింగపూర్ రూట్‌పై ఇండిగో నడిపిన విమానాలను నడిపింది.
0 Comments