Ad Code

నూతన సంవత్సరంలో సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల ఫైలుపై సీఎం చంద్రబాబు తొలి సంతకం


నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ది చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. దీంతో 1,600 మంది దరఖాస్తుదారులకు రూ. 24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది జూన్ లో అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు రూ. 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదలకు ఇచ్చారు. 7,523 మందికి లబ్ది కలిగింది. బుధవారం నాడు సీఎం చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధుల మొత్తం రూ. 124.16 కోట్లకు చేరింది. కూటమి ప్రభుత్వంలో మొత్తంమ్మీద 9,123 మంది సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రయోజనం పొందినట్లయ్యింది.

Post a Comment

0 Comments

Close Menu