Ad Code

లావా O3 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల !


దేశీయ మార్కెట్లో  లావా ఈరోజు O3 ప్రో ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను పెద్ద స్క్రీన్, బడ్జెట్ ప్రోసెసర్, స్లీక్ డిజైన్ మరియు పెద్ద బ్యాటరీ వంటి అన్ని ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ చేసినట్లు లావా తెలిపింది. లావా O3 ప్రో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 6,999 రూపాయల ధరతో సింగల్ వేరియంట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను అమెజాన్ నుంచి రిలీజ్ చేసింది. అలాగే, అమెజాన్ నుంచి ఈ ఫోన్ ను ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి లిస్ట్ అయ్యింది. లావా O3 ప్రో స్మార్ట్ ఫోన్ ను రౌండ్ కార్నర్స్ మరియు స్లీక్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ లో 6.56 ఇంచ్ HD+ స్క్రీన్ వుంది మరియు ఇది సెంటర్ పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ లావా కొత్త ఫోన్ Unisoc T606 ఆక్టాకోర్ ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 4GB ర్యామ్, 4GB ఎక్స్ పాండబుల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరా వైబ్రాంట్ ఫోటోలు మరియు 1080p వీడియోలు అందిస్తుందని లావా తెలిపింది. ఈ లావా కొత్త ఫోన్ 10W ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది.ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ సపోర్ట్ కూస్తో ఉన్నాయి. ఈ లావా ఫోన్ చాలా స్టైలిష్ లుక్స్ లో గ్లాసీ బ్లాక్, గ్లాసీ పర్పల్ మరియు గ్లాసీ వైట్ మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu