వాట్సాప్ వినియోగదారులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) కొన్ని సూచనలు జారీ చేసింది. వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయడం ఉత్తమం. దీని కోసం ముందుగా వాట్సాప్ ఖాతా ఓపెన్ చేసి అందులో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా ఒక పిన్ కూడా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీ ఖాతాను ఎవరూ హ్యాక్ చేసే అవకాశం లేదు. వాట్సాప్ ఖాతాను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మెటా ఎప్పటికప్పుడు ఫీచర్స్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇది మీ భద్రతను పెంచడంలో సహాయపడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే యాప్ అప్డేట్ పేరుతో వచ్చే సందేశాల విషయంలో కూడా యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాప్ అప్డేట్ పేరుతో ఫేక్ మెసేజ్‌లు వస్తుంటాయి. తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ (ఆడియో & వీడియో) స్వీకరించకపోవడం ఉత్తమం. కొంతమంది డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు వాట్సాప్ కాల్స్ ఉపయోగించే ప్రజలను మోసం చేస్తుంటారు. కాబట్టి తెలియని కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాట్ హెచ్చరిస్తోంది. పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లు అంత సురక్షితమైనవి కాదు. కాబట్టి హ్యాకర్లు ఎక్కువగా ఇలాంటి నెట్‌వర్క్‌లను ఉపయోగించి హ్యాక్ చేస్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ వైఫై ఉపయోగించడాన్ని తగ్గించాలి. తప్పనిసరిగా ప్రైవేట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించాలి. అప్పుడే మీ డేటా సేఫ్‌గా ఉంటుంది. ఫోన్‌లో డేటా భద్రంగా ఉండాలంటే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఉపయోగించాలి. సింపుల్ పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకుంటే.. హ్యాకర్స్ సులభంగా మొబైల్స్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ లేదా పేస్ ఐడెంటిటీ వంటివి సెట్ చేసుకోవడం కూడా ఉత్తమం.
0 Comments