పాత ఐఫోన్ మోడళ్లలో త్వరలో వాట్సాప్ సేవలు నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. వాట్సాప్ కొత్త నిర్ణయం 2025 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. iOS 15.1 కంటే ముందున్న OS వెర్షన్‌లపై పనిచేస్తున్న ఐఫోన్‌లు ప్రభావితం కానున్నాయి. ఐఫోన్ 5s, ఐఫోన్ 6, మరియు 6 ప్లస్ వంటి మోడళ్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. 2025 మే నెల నుంచి iOS 15.1 కంటే పాత OS వెర్షన్‌లపై పనిచేస్తున్న ఐఫోన్‌లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని సంస్థ తెలిపింది. అయితే కొత్త OS వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకుంటే వాట్సాప్ సేవలు కొనసాగుతాయని తెలిపింది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఈ వివరాలను వెల్లడించింది. ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మోడళ్లు గరిష్ఠంగా iOS 12.5.7 వెర్షన్ పైన మాత్రమే పనిచేస్తాయి. ఈ మోడళ్ల యూజర్లు వచ్చే సంవత్సరం జూన్ నాటికి వాట్సాప్ యాప్‌ను వినియోగించే అవకాశం లేదు. ఐఫోన్ యూజర్లకు మాత్రమే ఈ కొత్త నిర్ణయం వర్తిస్తుందని, ఆండ్రాయిడ్ యూజర్లపై ఎటువంటి ప్రభావం లేదని తెలిపింది. వాట్సాప్ ఇటీవల వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ నోట్‌ను Text రూపంలోనికి మార్చుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫీచర్ పటిష్ట భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుందని వాట్సాప్ తెలిపింది. యాజర్ల డివైస్‌లోనే వాయిస్ నోట్ టెక్ట్స్‌గా మారుతుందని తెలిపింది. ప్రైవసీ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడించలేదు.
0 Comments