స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కొత్త హ్యాండ్‌సెట్ లను లాంచ్ చేస్తున్న సమయంలో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. దీంతోపాటు బ్యాటరీ సామర్థ్యాలను మెరుగుపరుస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేసే హ్యాండ్‌సెట్ లను విడుదల చేస్తున్నాయి. ఫలితంగా తక్కువ సమయంలోనే ఫోన్‌ను ఛార్జింగ్ చేసేందుకు వీలుంటుంది. తాజా నివేదికల ఆధారంగా వచ్చే సంవత్సరంలో లాంచ్ అయ్యే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు ఏకంగా 8000mAh బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఒప్పో, రియల్‌మి ఫ్లాగ్‌షిప్ మోడళ్లు భారీ బ్యాటరీలను కలిగి ఉన్నాయి. రియల్‌మి GT 7 ప్రో చైనా వేరియంట్ 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే ఒప్పో ఫైండ్ X8 ప్రో మోడల్ 6,150mAh బ్యాటరీతో లాంచ్ అయింది. భవిష్యత్‌లో మరింత భారీ బ్యాటరీలను కలిగి ఉంటాయని టిప్‌స్టర్ డిజిటల్ ఛాట్ స్టేషన్ అంచనా వేశారు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి ఇప్పటికే ఈ తరహా ప్రయత్నాలు చేస్తోంది. రియల్‌మి GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కనీసం 7000mAh బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ కానుందని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం రియల్‌మి తన అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం బ్యాటరీ సామర్థ్యాలు, ఛార్జింగ్ సమయంపై టెస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రియల్‌మి GT 8 ప్రో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం 7000mAh, 7500mAh, 8000mAh బ్యాటరీ సామర్థ్యాలను టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. వరుసగా 120W, 100W, 80W ఛార్జింగ్ స్పీడ్ తో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టెస్టింగ్ లో మెరుగైన ఫలితాలు సాధిస్తే... భవిష్యత్ లో ఈ తరహా స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు రియల్‌మి సంస్థ సేల్స్ లో మరింత మెరుగైన స్థానానికి చేరుకొనే అవకాశం ఉంటుంది. బ్యాటరీని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేసే వారికి గుర్తొచ్చే తొలి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ గా మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఎంట్రీ లెవల్ హ్యాండ్‌సెట్ లకు కూడా 6000mAh బ్యాటరీలను అందిస్తున్నాయి.
0 Comments