Ad Code

ఇంటెల్ సీఈఓగా పాట్ గెల్సింగర్ రిటైర్ !


ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ కంపెనీ నుంచి వైదొలిగారు. 40 ఏండ్లుగా కెరీర్‍లో కొనసాగిన పాట్ గెల్సింగర్ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి రిటైర్ అయ్యారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆయన రిటైర్మెంట్ అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంటెల్ యాజమాన్యం ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తాత్కాలిక కో సీఈఓలుగా నియమించింది. డేవిడ్ జిన్స్‌నర్, మిచెల్లె జాన్టన్ హోల్థౌస్‌లను తాత్కాలిక కో సీఈఓలుగా నియమించినట్లు తెలిపింది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఇండిపెండెంట్ చైర్‌గా ఉన్న ఫ్రాంక్ ఇయరీ.. కంపెనీ తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఇంటెల్ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ ఫౌండ్రీ నాయకత్వంలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. జెన్స్‌నర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కం చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గా ఉంటారు. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటెల్ ప్రొడక్ట్స్ సీఈఓగా హోల్టౌస్ ఉంటారు. ఈ ఇంటెల్ ప్రొడక్ట్స్ గ్రూపులో కంపెనీ క్లయింట్ కంప్యూటింగ్ గ్రూప్ (సీసీజీ), డేటా సెంటర్ అండ్ ఏఐ గ్రూప్ (డీసీఏఐ), నెట్ వర్క్ అండ్ ఎడ్జ్ గ్రూప్ (ఎన్ఈఎక్స్) ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu