Ad Code

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం !


మెటా సర్వర్ డౌన్ కావడంతో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ల్లో అంతరాయం ఏర్పడింది. సందేశాలు పంపడం నుంచి పోస్ట్లు చేయడం వరకు వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు తమ అనుభవాలను ట్విట్టర్ లో షేర్ చేశారు. మెటాలోని దాదాపు అన్ని ప్లాట్ ఫారమ్ లలో ఈ సమస్య ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. Downdetector.com ప్రకారం ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ల వినియోగదారులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిరంతరం ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వినియోగదారులపై ఫిర్యాదులపై, వారి సమస్యలపై మెటా ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. తాజాగా తలెత్తిన సర్వర్ సమస్యల కారణంగా లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంతరాయానికి కారణం, ఎంతకాలం సేవ అందుబాటులో ఉండదనే విషయాలపై మెటా ఇంకా ఎలాంటి అధికారిక నివేదికను విడుదల చేయలేదు. ఇదిలావుంటే, అక్టోబరులో కూడా ప్లాట్ఫారమ్లలో సమస్యలు తలెత్తాయి. అప్పట్లో సమస్యపై స్పందించిన మెటా.. ఒక గంటలోపు సేవలను పునరుద్ధరించింది. మెటా సర్వర్ నిలిచిపోయి సోషల్ మీడియాలో తలెత్తిన సమస్యలపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ యాప్ లేదా వెబ్సైట్ను ఉపయోగించలేకపోతున్నట్టు తెలిపారు. తమ కార్యకలాపాలు కూడా నిలిచిపోతున్నాయని చాలా మంది పేర్కొన్నారు. అయితే.. వీరి ఆగ్రహాన్ని గ్రహించిన ఫేస్బుక్ ``వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించడానికి పని చేస్తున్నాము" అని పేర్కొంది. 

Post a Comment

0 Comments

Close Menu