Ad Code

చెన్నైలో తొలి డయాబెటిస్‌ బయో బ్యాంక్‌ !


దేశంలోనే తొలి డయాబెటిస్‌ బయో బ్యాంకును భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) చెన్నైలో స్థాపించింది. మద్రాసు డయాబెటిస్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎండీఆర్‌ఎఫ్‌) సంయుక్త ఆధ్వర్యంలో ఈ బయోబ్యాంకు ఏర్పడింది.ఐసీఎంఆర్‌ అనుమతితో శాస్త్రీయ పరిశోధనలకు ఈ బయోబ్యాంకు తోడ్పాటును అందిస్తుంది. బయోస్పెసిమెన్ల సేకరణ, బయోస్పెసిమెన్లను ప్రాసెస్‌ చేయడం, బయోస్పెసిమెన్లను భద్రపరచడం, పంపిణీ చేయడం దీని లక్ష్యం. ఏం పరిశోధనలు చేస్తారు? డయాబెటిస్‌ వచ్చేందుకు కారణాలు, డయాబెటిస్‌ లో భారతీయ రకాలకు చెందిన తేడాలు, సంబంధిత రుగ్మతలను బయోబ్యాంకు సాయంతో ఆధునిక పరిశోధనలు జరుగుతాయి. 

Post a Comment

0 Comments

Close Menu