Ad Code

పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం విజయవంతం !


పీఎస్‌ఎల్‌వీ-సీ59 (ప్రోబా-3 మిషన్‌) ప్రయోగం విజయవంతమైంది. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ(ఈఎస్‌ఏ )కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలతో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ59 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీనికోసం అవి పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి ఈఎస్‌ఏ తెలిపింది. వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లి విజయవంతమైంది.మిషన్ విజయవంతంగా పూర్తయిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu