Ad Code

ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025లో వైవే ఈవీఏ సోలార్ కారు లాంచ్ ?


దేశంలో మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారును ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025లో వైవే ఈవీఏ సోలార్ కారును లాంచ్ చేయబోతోంది. సోలార్ ఎనర్జీతో నడిచే ఈ చిన్న మైక్రో కారు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ట్రాఫిక్‌లో చాలా సులభంగా వెళ్తుంది. మంచి, సులభమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది కొంచెం ఎంజీ కామెట్‌ను పోలి ఉంటుందని అంచనా. ఇది 3 సీటర్ కారు, ముందు భాగంలో సింగిల్ సీటు, వెనుక భాగంలో రెండు సీట్లతో వస్తుందని భావిస్తున్నారు. చిన్న లిక్విడ్ కూల్డ్ 14 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్, వాల్ సాకెట్ ద్వారా రీఛార్జ్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం 45 నిమిషాల్లో 80 శాతం అవుతుంది. బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ రేంజ్ 250 కిలోమీటర్లు ఉంటుంది. సోలార్ ఛార్జింగ్ ఆప్షన్‌ వల్ల కారులోని సన్ రూఫ్ లో 150వాట్ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. రేంజ్ పెరిగేందుకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఈవీఏలో రిచ్ క్యాబిన్ ఉండనుంది. వీటితో పాటు రివర్సింగ్ కెమెరా, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టూ స్పోక్ స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu