దేశీయ మార్కెట్లో రెడ్ మీ నోట్ 14 5జీ సిరీస్ స్మార్ట్ ఫోన్లను షియోమీ ఈరోజు విడుదల చేసింది. ఇందులో బడ్జెట్, మిడ్ రేంజ్ మరియు ప్రీమియం ఫోన్లు ఉన్నాయి. ఈ సిరీస్ నుంచి రెడ్ మీ నోట్ 14 5G, రెడ్ మీ నోట్ 14 5G ప్రో, రెడ్ మీ నోట్ 14 5G ప్లస్ మూడు ఫోన్లు విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 14, నోట్ 14 ప్రో మరియు నోట్ 4 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ లు డిసెంబర్ 13 వ తేదీ నుంచి  సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ మూడు స్మార్ట్ ఫోన్స్ పై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐ పై రూ. 1,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.