దేశీయ మార్కెట్‌లోకి ఇవాళ ఒప్పో ఫైండ్ X8 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో ఫైండ్ X8 మరియు ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత colorOS 15 Skin తో పనిచేస్తుంది. ఈ సిరీస్‌లో కెమెరాల విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్, 460 ppi పిక్సల్ డెన్సిటీ, 1256*2760 పిక్సల్స్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి వచ్చింది. 80W సూపర్‌వూక్, 50W ఎయిర్‌వూక్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5630mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌దో 50MP సోనీ LYT-700 కెమెరా, f/2.0 అపేచర్, 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 50MP అల్ట్రావైడ్ కెమెరా, f/2.6 అపేచర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ LYT-600 పెరిస్కోప్ కెమెరాలను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాలతో అందుబాటులో ఉంది. ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్, 450 ppi పిక్సల్ డెన్సిటీ, 1264*2780 పిక్సల్స్ రిజల్యూషన్‌తో విడుదల అయింది. ఒప్పో ఫైండ్ X8 ప్రో మోడల్ వెనుకవైపు క్వాడ్ కెమెరాలను కలిగి ఉంది. f/1.6 అపేచర్‌తో 50MP సోనీ LYT-808 కెమెరా, f/2.0 అపేచర్ తోపాటు 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 50MP అల్ట్రావైడ్ కెమెరా, f/2.6 అపేచర్‌తోపాటు 3x ఆప్టికల్ జూమ్ తో 50MP సోనీ LTY-600 ను కలిగి ఉంది. f/4.3 అపేచర్‌తోపాటు 6x ఆప్టికల్ జూమ్ సపోర్టుతో 50MP సోనీ IMX858 పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంటుంది. ఈ ప్రో మోడల్ 80W సూపర్‌వూక్, 50W ఎయిర్‌వూక్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5910mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 3nm మీడియాటెక్ ఆక్టా కోర్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ను కలిగి ఉన్నాయి. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 తో పనిచేస్తుంది. ఆరు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని ఒప్పో చెబుతోంది. ఈ ఒప్పో ఫైండ్ X8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు IP68/IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 5G. 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 7, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. గైరోస్కోప్, యాక్సెలిరో మీటర్, మాగ్నటోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ తో అందుబాటులో ఉంది. ఒప్పో ఫైండ్ X8 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.69,999 గా ఉంది. అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999 గా ఉంది. స్పేస్ బ్లాక్, స్టార్ గ్రే రంగుల్లో లభిస్తుంది. ప్రో మోడల్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.99,999 గా ఉంది. పెర్ల్ వైట్, స్పేస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
0 Comments