ఆపరేటింగ్ సిస్టమ్ వ్యవస్థలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ గుత్తాధిపత్యం కొనసాగుతున్న వేళ నథింగ్ సొంతంగానే ఓ ఓఎస్‌ను రూపొందించాలనుకుంటోంది. కంపెనీ వ్యవస్థాపకుడు, వన్‌ప్లస్ మాజీ సీఈఓ కార్ల్ పై స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టెక్‌క్రంచ్ సంస్థ నిర్వహించిన సదస్సులో దీనిపై కార్ల్‌పై మాట్లాడుతూ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించేందుకు కావాల్సిన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా జోడించనున్నట్లు తెలిపారు. సొంత ఓఎస్ ద్వారా మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి సాధ్యపడుతుందని చెప్పారు. నిధుల కొరత ఉన్నప్పటికీ కంపెనీ దీనిపై పనిచేయగలదని పేర్కొన్నారు.
0 Comments