ఝార్ఖండ్‌లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు భిన్నంగా ఇండియా కూటమి గెలువబోతోంది. మొత్తం అసెంబ్లీ స్థానాలు 81 ఉన్నాయి. ఇక్కడ అధికారంలోకి రావాలి అంటే తప్పకుండా మేజిక్ ఫిగర్ 41 దాటాలి. ప్రస్తుతం 50కి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఇండియా కూటమి గెలుపు దిశగా వెళ్తుంది. ఝార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఝార్ఖండ్‌లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ప్రధాన పోరు ఉండనుంది. ఇండియా కూటమిలో ఆర్జేడీ, సీపీఐ(ML), జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. అలాగే ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూ, ఏజేఎస్‌యూ, లోక్‌జన్‌శక్తి వంటివి ఉన్నాయి. అయితే ఈ రాష్ట్ర ఎన్నికలను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గిరిజనులను ఆకట్టుకునేలా ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చింది. గత 5 ఏళ్లలో అక్కడి ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు. అవినీతి ఎలా పెరిగిపోయింది వంటి చాలా అంశాలను ఎన్డీయే కూటమి ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఝార్ఖండ్‌లో ఇప్పటికే అధికారంలో ఉన్న జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రజల్లో తన బలం చూపించుకోవాలని ఎన్నికల్లోకి దిగింది. అయితే గత సంవత్సరం నుంచి ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఏం బాగుండటం లేదు. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను అవినీతి కేసులో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పార్టీ కష్టాలను ఎదుర్కొంది. కానీ, కాంగ్రెస్ భరోసాగా నిలిచింది. దాంతో ఇప్పుడు ఇద్దరూ కలిసి మరోసారి బలం చూపించుకోవడానికి సిద్ధం అయ్యారు.
0 Comments