Ad Code

కుట్రలు చేసిన కేటీఆర్ ఊచలు లెక్క పెడతారంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక !


తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వేములవాడలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. కొన్నేళ్లుగా వాయిదా పడుతూవస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. తమ మంత్రులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టులపై సమీక్షిస్తారని చెప్పారు. ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో కేటీఆర్‌ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించే భూమికి రైతులకు రెండు రెట్ల పరిహారం ఇస్తామన్నారు. భూములు తీసుకుని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలా పరిహారం ఇవ్వకుండా తప్పించుకోమన్నారు. భూమి మార్కెట్ ధర రూ.10 లక్షలు ఉంటే రూ.30 లక్షల పరిహారం ఇస్తామన్నారు. నష్ట పరిహారం ఎక్కువ ఇస్తే భూ యజమానులు తమ భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తారన్నారు. పరిశ్రమలు రావాలంటే భూసేకరణ చేయాల్సిందేనన్నారు. తెలంగాణకు పరిశ్రమలు వద్దని బీఆర్‌ఎస్ కోరుకుంటుందా అని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉంటూ కుట్రలు చేశారంటూ కేటీఆర్‌పై రేవంత్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సక్రమంగా పరిహారం ఇవ్వలేదన్నారు. కుట్రలు చేసిన కేటీఆర్ ఊచలు లెక్కపెడతారంటూ హెచ్చరించారు. కేటీఆర్ చేసిన కుట్రలను గమనిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. ఎంత ఎగురుతావో ఎగురంటూ చురకలంటించారు. కేటీఆర్ తన వైఖరి మార్చుకోవాలని రేవంత్ పరోక్షంగా సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu