ఐఫోన్ యూజర్‌లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్‌ల అవసరం లేకుండా కాలింగ్ సమయంలో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అనేక ఐఫోన్ మోడళ్లు సపోర్టు చేస్తాయి. ఐఫోన్ యూజర్‌లు ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను పొందేందుకు తొలుత iOS 18.1 వెర్షన్‌కు అప్‌డేట్ కావాల్సి ఉంది. అప్‌డేట్ వివరాలు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. లేకుంటే మాన్యువల్‌గానూ సెట్టింగ్స్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లోకి వెళ్లి అప్‌డేట్ చేసుకోవాలి. ఐఫోన్‌లలో iOS 18.1 వెర్షన్ అప్‌డేట్ అయ్యాక కాలింగ్ సమయంలో మీకు రికార్డు బటన్ కనిపిస్తుంది. కాలింగ్ స్క్రీన్‌లో Top Left లో ఈ బటన్‌ను గుర్తించవచ్చు. ఆ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ఇన్‌కమింగ్ లేదా అవుట్‌గోయింగ్ కాల్స్‌ను రికార్డు చేయవచ్చు. అయితే మీరు కాల్ రికార్డు చేస్తున్న విషయం అవతలి వ్యక్తులకు కూడా ఆడియో రూపంలో తెలుస్తుంది. iOS 18 అప్‌డేట్‌ను సపోర్టు చేస్తున్న ఐఫోన్‌లలో కొన్ని హ్యాండ్‌సెట్‌లు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్టు చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్టు చేసే డివైస్‌లు రియల్ టైమ్‌లో కాల్ రికార్డు ట్రాన్సిక్రిప్షన్‌ను అందిస్తాయి. అయితే ప్రస్తుతం ఇంగ్లీష్, స్పానిష్, ప్రెంచ్, జర్మన్, జపానిస్, సహా మరికొన్ని భాషల్లో ట్రాన్సిక్రిప్షన్ పొందవచ్చు. కాల్ పూర్తయిన తర్వాత వాయిస్ నోట్స్ యాప్‌లో రికార్డింగ్ సేవ్ అవుతుంది. దీంతోపాటు ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ద్వారా కాల్‌లోని ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో పొందవచ్చు. ఫలితంగా మొత్తం కాల్ రికార్డింగ్ వినకుండా ముఖ్యమైన అంశాలను తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఐఫోన్ యూజర్‌లు ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను ఆఫ్ చేసుకొనేందుకు కూడా అవకాశం ఉంది. ఈ కాల్స్‌కు సంబందించిన రికార్డింగ్‌లు అన్నీ నోట్స్ యాప్‌లో సేవ్ కానున్నాయి. అయితే ఇప్పటికి ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 సిరీస్‌లు మాత్రమే ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను సపోర్టు చేస్తున్నాయి.
0 Comments