వాట్సాప్ ‘మెన్షన్’ ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఏదైనా స్టోరీ అప్‌లోడ్ చేసిన సమయంలో నచ్చిన వ్యక్తులకు ట్యాగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ‘@’ సింబల్‌తో ఇలా మీకు నచ్చిన వ్యక్తులను ట్యాగ్ చేసుకుంటారు. దీంతో కచ్చితంగా వాళ్లకు మన స్టోరీ కనిపిస్తుంది. వాట్సాప్‌లో తీసుకొచ్చిన ‘మెన్షన్’ ఫీచర్ కూడా ఇలాంటిదే. వాట్సాప్‌లో మనం స్టేటస్ పోస్ట్ చేసే సమయంలో కాంటాక్ట్‌లోని నచ్చిన వ్యక్తులకు ట్యాగ్ చేయొచ్చు. స్టేటస్ అప్‌లోడ్ చేసే సమయంలో 'యాడ్ క్యాప్సన్ అనే' బార్‌కు కుడివైపున '@' ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీ వాట్సప్‌లోని కాంటాక్ట్స్ కనిపిస్తాయి. వీటిలో మీకు నచ్చిన వ్యక్తులను సెలక్ట్ చేసుకోవచ్చు. దీంతో మీరు స్టేటస్ అప్‌లోడ్ చేయగానే వాళ్లకు నోటిఫికేషన్ వెళ్తుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో లాగా మీరు ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు అందరికీ కనిపించదు. దీంతో యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఢోకా ఉండదన్నమాట.
0 Comments