తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఈ నెల 11న అధికారులపై జరిగిన దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి ఘటనలో ఉన్నతాధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పరిగి డీఎస్పీగా కరుణసాగర్‌రెడ్డిపై వేటు వేసింది. డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌ను నియమించింది. మరోవైపు కలెక్టర్‌పై దాడి కేసులో కొత్తకోణం చేసుకుంది. దాడి ఘటనలో పంచాయితీ సెక్రటరీ రాఘవేందర్ కీలక పాత్ర ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం సంగయ్య పల్లి పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తున్న రాఘవేందర్ రైతుల్ని రెచ్చగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలో సంగయ్యపల్లి పంచాయితీ సెక్రటరీపై రాఘవేందర్‌పై వేటు వేస్తూ సంబంధిశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
0 Comments