రెండు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో భాగంగా అదానీ గ్రూప్ కెన్యాట్టలా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రెండో రన్‌వేని ఏర్పాటు చేయాలి. 30 ఏళ్ల లీజుతో ప్యాసింజర్ టెర్మినల్ అప్‌గ్రేడ్ చేయాలి. ఎలక్ట్రిక్ ట్రాన్స్‌మిషన్ లైన్స్ నిర్మించేందుకు అదానీ గ్రూపుతో ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ 30 ఏళ్లకు గానూ 736 మిలియన్ డాలర్ల ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రూటో తెలిపారు. “రవాణా మంత్రిత్వ శాఖలోని మరియు ఇంధన మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖలోని ఏజన్సీలను నేను ప్రస్తుతం కొనసాగుతున్న ప్రొక్యూర్మెంట్‌ని వెంటనే రద్దు చేయమని ఆదేశించాను” అని రుటో తన దేశ ప్రసంగంలో తెలిపాడు. పరిశోధన సంస్థలు, భాగస్వామ్య దేశాలు అందించిన సమాచారమే దీనికి కారణమని తెలిపారు. ఈ ఒప్పందాలు చాలా మంది రాజకీయ నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాయి. ప్రజల నుంచి పారదర్శకత, డబ్బుకు విలువ ఇవ్వడం లేదనే ఆందోళన నేపథ్యంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతకుముందు, గౌతమ్ అదానీ, మరో ఏడుగురిపై అమెరికా ప్రాసిక్యూటర్ అభియోగాలు మోపారు. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లను లంచంగా ఇచ్చారని ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది. 2023లో హిండెన్‌బర్గ్ రిపోర్టు వచ్చిన తర్వాత కెన్యాలో ఒప్పందాలు రద్దు చేసుకోవాలనే డిమాండ్లు వచ్చినప్పటికీ.. రూటో ఒప్పందాలను సమర్థించారు. తాజాగా ఈ ఒప్పందాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు.
0 Comments