Ad Code

స్పేస్ ఎక్స్ తో ఇస్రో భాగస్వామ్యం ?


భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ త్వరలో శాటిలైట్‌ని నింగిలోకి పంపనున్నది. ఇటీవల వరుస విజయాలతో ఊపుమీదున్న ఇస్రో తొలిసారిగా ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ సహాయం తీసుకోనున్నది. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ సహాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. ఇటీవల ఇస్రో పలు దేశాలకు చెందిన రాకెట్లను నిర్ణీత కక్షలో ప్రవేశపెడుతూ.. భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. తాజాగా భారత్‌కు చెందిన శాటిలైట్‌ని అంతరిక్షంలోకి స్పేస్‌ఎక్స్‌ కంపెనీని సహాయం కోరుతున్నది. ఇస్రో భారీ ఉపగ్రహాలను మార్క్‌-3 ద్వారా నింగిలోకి తీసుకెళ్తుంది. మార్క్‌-3 రాకెట్‌ 4వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే సామర్థ్యం ఉంది. అయితే, ఇస్రో కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ అయిన జీశాట్‌ ఎన్‌2ని నింగిలోకి తీసుకెళ్లాల్సి ఉంది. ఈ రాకెట్‌ బరువు 4700 కిలోల బరువు ఉంటుంది. ఈ క్రమంలో స్పేస్‌ఎక్స్‌ సహాయం కోరుతున్నది. స్పేస్ఎక్స్‌ ఫాల్కన్-9 రాకెట్ జీశాట్-ఎన్2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ని ఉపయోగించుకొని ఇస్రో చేపడుతున్న తొలి వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగం ఇదే కావడం విశేషం. ఇదిలా జీశాట్-ఎన్2 శాటిలైట్ విమానాల్లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే, భారత్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్‌ని విస్తరించనున్నది

Post a Comment

0 Comments

Close Menu